ప్రకాశం: గతంలో వైసీపీ అధినేత ముద్రతో పాస్ బుక్కులు అందించిందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం రాజముద్రతో పాస్ బుక్కులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తనయుడు కందుల విజ్ఞేష్ రెడ్డి తెలిపారు. గురువారం పొదిలిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, రైతులకు పాస్ బుక్కులు అందజేశారు. ఏ పార్టీని ప్రోత్సహించేలా ముద్రలు ప్రింట్ చేయలేదన్నారు.