ADB: మహిళల రక్షణ చర్యలకు జిల్లా పోలీసు యంత్రాంగం మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఇవాళ తాంసి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర పనుల నిమిత్తం ప్రత్యేకంగా నిర్మించిన నూతన గదిని ఎస్పీ ప్రారంభించారు. షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ ఫణిదర్, ఎస్సై జీవన్ రెడ్డి పాల్గొన్నారు.