NZB: ఎన్నికల్లో తమ అభిమాన నాయకులు కొత్తపల్లి హారిక అశోక్ సర్పంచ్‌గా విజయం సాధిస్తే శబరిమల వస్తామని మొక్కుకున్న కమ్మర్‌పల్లికి చెందిన పలువురు భక్తులు గురువారం అయ్యప్ప కొండకు చేరుకున్నారు. ఆమె గెలుపును పురస్కరించుకుని మొక్కు తీర్చుకునేందుకు వెళ్లినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్కం దిలీప్, ప్రకాష్, కార్తీక్, సాగర్ ఉన్నారు.