ప్రకాశం: నాగులుప్పలపాడులో ఎస్సై రజియా సుల్తానా ఆధ్వర్యంలో శుక్రవారం వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆమె వాహనదారులను హెచ్చరించారు. ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆమె సూచించారు.