ISSలో ఉన్న నలుగురితో కూడిన ఆస్ట్రోనాట్ల బృందం నిర్ణిత గడువు కంటే నెల రోజుల ముందే భూమిపైకి చేరుకుంటుందని నాసా ప్రకటించింది. ఆ బృందంలోని ఒక వ్యోమగామికి తీవ్ర అనారోగ్యం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కానీ ఆ వ్యోమగామి పేరును చెప్పలేదు. అయితే అత్యవసర తరలింపు కాదని పేర్కొంది. ఇలా తమ మిషన్ను తగ్గించుకోవడం నాసా చరిత్రలో ఇదే తొలిసారి.