NLR: కొడవలూరు మండలంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు పేట కోటేశ్వరమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొత్త ఒంగోలు గ్రామంలో నిద్రిస్తున్న ఆమెను వేముల రంజిత్ అనే వ్యక్తి హత్య చేసి, బంగారు సరుడును దోచుకెళ్లినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.