KRNL: ఆదోని మండల పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లు దారుణంగా తయారయ్యాయి. రోడ్లన్నీ గుంతలమయమై ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీనివల్ల రైతులు పొలం పనులు ముగించుకుని పంటను మార్కెట్కు తరలించే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల వల్ల ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. రహదారులు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.