కృష్ణా: కంకిపాడు మండలం ఈడుపుగల్లు సెంటర్ లో స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ,పోలీస్ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై తాతాచార్యులు మాట్లాడుతూ.. సంక్రాంతిని శుభ్రంగా,సురక్షితంగా జరుపుకోవాలని,కోడిపందాలు వేయడం, జూదం ఆడటం చట్టరీత్యా నేరమని,ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.