SRCL: గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామంలో గురువారం ప్యాసింజర్ ఆటో ప్రమాదానికి గురైంది. రోడ్డుపై అకస్మాత్తుగా వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షత గాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.