TG: ప్రమాణ స్వీకారం చేయని డీసీసీ చీఫ్‌లకు టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది నవంబర్ 23వ తేదీన డీసీసీ అధ్యక్షుల పేర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అప్పటినుంచి 10 మంది డీసీసీ అధ్యక్షులు ప్రమాణస్వీకారం చేయలేదు. దీంతో ఇవాళ గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ప్రమాణం చేయని 10 మంది డీసీసీ అధ్యక్షులపై సీరియస్ అయినట్లు సమాచారం.