NGKL: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. సిట్ ముందు హాజరుకావాలని ఆయనకు ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, ఆ విచారణలో భాగంగా జైపాల్ యాదవ్‌కు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.