W.G: కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై ‘బైండోవర్’ కేసులు నమోదు చేస్తామని నరసాపురం తహశీల్దార్ సత్యనారాయణ హెచ్చరించారు. గురువారం వేములదీవి వెస్ట్, ఈస్ట్ గ్రామాల్లో అవగహన సదస్సులు, ర్యాలీ నిర్వహించారు. కోడి పందేలు నిర్వహించడం వల్ల యువత ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా చెడు మార్గాల వైపు వెళ్లే ప్రమాదం ఉందన్నారు.