KKD: జగ్గంపేట మండలం రాజపూడి సొసైటీ కార్యాలయంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు యూరియా పంపిణీ చేశారు. రాజపూడి సొసైటీకి చేరుకున్న జ్యోతుల నవీన్‌కు సొసైటీ ఛైర్మన్ ఉప్పలపాటి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు.