కోనసీమ: సీఎం చంద్రబాబు రాయవరం పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు సీఎం రాయవరంలో పర్యటిస్తారని చెప్పారు. రాయవరం మహేంద్రవాడ రోడ్ లోని లే అవుట్లో బహిరంగ సభలో ప్రభుత్వం కొత్తగా రాజముద్ర తో ముద్రించిన రైతుల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తారన్నారు.