SRCL: ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో రాత్రి మరో ఇంటిలో దొంగలు చోరికి పాల్పడ్డారు. గ్రామంలోని గడ్డి చంద్రయ్య ఇంట్లో దొంగలు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. దొంగలు చంద్రయ్య ఇంట్లోని 3 తులాల బంగారం, 25 తులాల వెండి, 17 వేల రూపాయలు దొంగలు ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.