KNR: గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ నీటి హక్కుల తాకట్టుపై కూడా నిజాలు చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఏపీ మంత్రి ఇంట్లో విందు ఆరగించి, రాయలసీమ ప్రాజెక్టులకు కేసీఆర్ అంగీకరించారని విమర్శించారు. ఆనాటి చీకటి ఒప్పందాల మర్మాన్ని కవిత ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.