ప్రకాశం: తర్లుపాడు మండలం కేతగుడిపిలో జనసేన పార్టీ గ్రామ కమిటీలను మంగళవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు కాశి రావు మాట్లాడుతూ.. కూటమిలోని అన్ని పార్టీలను కలుపుకొని ప్రజలకు సేవ చేయాలని అలాగే రాబోయే స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలన్నారు.