AP: తప్పుడు రాతలపై పోరాటం చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ‘కావాలనే నన్ను కించపరిచేలా సాక్షిలో కథనాలు వచ్చాయి. సాక్షి కథనం తప్పని కోర్టుకు ఆధారాలు చూపించా. ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. యువతకు ఉపాధి కల్పించాలనేదే మా లక్ష్యం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు. మహిళలపై దాడి చేస్తే ఊరుకోబోము’ అని స్పష్టం చేశారు.