GDWL: మల్దకల్లోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర (తిమ్మప్ప) స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని రేపు నిర్వహించనున్నట్లు దేవాలయ ఛైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఉదయం 10 గంటలకు హుండీ లెక్కింపు ప్రారంభమవుతుందని వారు పేర్కొన్నారు.