HYD: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి సుమారు రూ. 14 కోట్ల విలువైన 14 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.