MHBD: ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో కోతుల బెడద విపరీతంగా పెరిగింది. వ్యవసాయ క్షేత్రాలు, జనవాసాల మధ్య వానరాల వీరంగంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతిరోజు కోతులు చిన్నారులు, వృద్ధులు, మహిళలు, రైతులపై దాడులకు పాల్పడి గాయపరిచిన ఘటనలు ఉన్నాయి. అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.