వరంగల్ జిల్లాలో మే 3న జరగనున్న నీట్-2026 (యూజీ) పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి, పరీక్షా కేంద్రాలపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ఈ నెల 15లోపు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.