KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ, బాన్సువాడ లయన్స్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత మోతిబిందు నిర్ధారణ, కంటి పరీక్షలు నిర్వహించాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ నేత్ర వైద్య సహాయ అధికారి బి.హరికిషన్ రావు 41మందికి పరీక్షలు నిర్వహించారు.