ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ప్రజల భద్రత, నేర నివారణే లక్ష్యంగా గురువారం బెస్తవారిపేటలో ఎస్సై రవీంద్ర రెడ్డి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, రోడ్ సేఫ్టీ వారియర్లు కలిసి వాహనదారులు, ప్రజలకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. గంజాయి వినియోగం, హెల్మెట్ ధరించకపోవడం, అధిక వేగం, వంటి అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు.