ATP: గుత్తిలోని చక్రాల సీతారామయ్య వీధిలో నివాసముండే ప్రముఖ జ్యోతిష్యుడు చక్రాల నరసింహులు శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఛాతీలో విపరీతంగా నొప్పి రావడంతో కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నరసింహులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన మృతి పట్ల వేద పండితులు, జ్యోతిష్యులు, పూజారులు సంతాపం ప్రకటించారు.