రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే US మార్కెట్లో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. అదరగొడుతోంది. ప్రీ సేల్స్‌లో 1 మిలియన్ మార్క్‌ను దాటేసింది. ఇక ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రలు పోషించగా.. తమన్ మ్యూజిక్ అందించాడు.