BDK: జిల్లా అటవీ పరిసర ప్రాంతాలలో అరకును తలపించే అందాలు కనువిందు చేస్తున్నాయి. కళ్ళకి విందుగా, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తున్నా కూడా గత కొద్ది రోజులుగా కురుస్తున్న పొగమంచు కారణంగా ఉదయం ప్రయాణిస్తున్న వాహనదారులకు మాత్రం ఇబ్బందికరంగానే మారింది. ఎదురుగా ఇరవై అడుగుల దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించనంత పొగమంచు కమ్ముకుంటోంది.