JN: స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన వృద్ధుడు అన్నెపు వెంకటయ్యను రికార్డుల్లో మృతుడిగా నమోదు చేయడంతో గత 7 నెలలుగా ఆసరా పెన్షన్ నిలిచిపోయింది. పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వెంకటయ్య, “బ్రతికుండగానే నన్ను చంపేశారు” అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని న్యాయం చేయాలని గురువారం వృద్ధుడు కోరాడు.