SKLM: ధాన్యం సేకరణలో పారదర్శకత పాటించాలని జిల్లా జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. గురువారం సాయంత్రం జలుమూరు మండలంలో పర్యటించారు. జలుమూరు మండలం అల్లాడ రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను, రైతులకు అందుతున్న సదుపాయాలను పర్యవేక్షించారు. నిబంధనల ప్రకారం మిల్లింగ్ ప్రక్రియ సాగాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అన్నారు.