సత్యసాయి: కదిరి వెలుగు కార్యాలయంలో సెర్ప్ యానిమేటర్ల కృతజ్ఞత సమావేశం శుక్రవారం నిర్వహించారు. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు ఉన్న మూడేళ్ల కాలపరిమితి నిబంధనను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో CM చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.