AP: చట్టాలు రాతిపై చెక్కన శిల్పాలు కావని, రాజ్యాంగంలో కూడా అనేక సవరణలు చేసుకున్నామని రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఉపాధి హామీ పథకంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉద్ధేశపూర్వకంగానే తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. పనిదినాలు కచ్చితంగా పెంచి చూపిస్తామని ధీమా ఇచ్చారు.