KRNL: పెద్దకడబూరు మండలం హనుమపురం గ్రామంలో రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి ఇవాళ పాల్గొని రైతులకు ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం కింద ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. రైతులకు భూమిపై హక్కు భరోసా కల్పించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.