ASF: కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించిన RPF ఇన్స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని RPF ఐజీ అరోమా సింగ్ ఠాకూర్ ఇవాళ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికుల రక్షణే తమ ప్రాధాన్యమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, పిల్లల భద్రత, మానవ అక్రమ రవాణా నిరోధం, మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆమె వెల్లడించారు.