CTR: జిల్లాలోని పలమనేరు వద్ద స్కూల్ బస్ ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య పరీక్షలు చేసుకుని వస్తుండగా ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.