SKLM: దివ్యంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస మండలం కేదారిపురం గ్రామంలో మంగళవారం దివ్యంగులకు వీల్ చైర్లు, వినికిడి పరికరాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రూ. 74 లక్షలతో 350 మందికి వీల్ చైర్లు, వినికిడి పరికరాలను పంపిణీ చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దివ్యంగులను పట్టించుకోలేదని విమర్శించారు.