TG: MLC కవిత రాజీనామాపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత ఆవేదనను తాము అర్థం చేసుకున్నామని అన్నారు. రాజీనామాపై కవిత పునరాలోచించుకోవాలని సూచించారు. కాగా, పునరాలోచన లేదు, రాజీనామాను ఆమోదించాలని కవిత మరోసారి మండలి ఛైర్మన్‌ను కోరారు. త్వరలో కవిత రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.