TG: రాష్ట్ర ఏర్పాటు తర్వాత తనపై కక్ష కట్టారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ‘BRS పార్టీ రాజ్యాంగం ఒక జోక్. నన్నుపార్టీ నుంచి తొలగించినప్పడు రాత్రికి రాత్రి కమిటి పుట్టుకొచ్చింది. నన్ను సస్పెండ్ చేసినప్పుడు నా వివరణ అడగలేదు. ఉరి తీసేవారిని కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ నన్ను అడగలేదు. నాది ఆస్తి పంచాయితీ కాదు.. ఆత్మ గౌరవ పంచాయితీ’ అని పేర్కొన్నారు.