AP: ఏపీ సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత దీపక్ రెడ్డి జీతం వివాదం ఎట్టకేలకు సుఖాంతమైంది. గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఆయన వేతన బకాయిలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవోను విడుదల చేసింది. కాగా, ఇటీవల రాష్ట్రంలో IASలపై దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.