MHBD: ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లి నూతన సర్పంచ్ భూక్యా శోభన్, ఉప సర్పంచ్ కొనతం జ్యోతి వెంకన్న, వార్డు సభ్యులు ఇవాళ మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.