W.G: అంతర్జాతీయ స్థాయిలో మల్టీ టాలెంటెడ్ అవార్డుతో పాటు ఇటీవల ‘నంది’ అవార్డు గెలుచుకున్న ఆకివీడు మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ శిష్యురాలు ఘంటా షైనీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అభినందించారు. ఇవాళ ఆయనను కలిసిన షైనీని మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని అన్నారు.