E.G: జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నల్లజర్ల మండలం దూబచర్లలో మంగళవారం వాకథాన్ & అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై. బ్రహ్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలైట్ కళాశాల, సంఘమిత్ర పాఠశాల విద్యార్థులు పాల్గొని జాతీయ రోడ్డు భద్రతా నియమాలను ప్రదర్శించారు.