ప్రకాశం: గిద్దలూరు మండలం కంచిపల్లె గ్రామంలో పోతురాజు తిమ్మయ్యకు చెందిన గేదెలకు గుర్తు తెలియని వ్యక్తులు విష గుళికలు తినిపించడంతో నాలుగు గేదేలు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువచేసే గేదెలు చనిపోయాయని తీవ్ర మనోవేదనతో వాపోతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.