NLG: ఎస్పీ ఆదేశాలు వ్యాపారులకు కలిసి వచ్చినట్లు అయింది. ‘నో హెల్మెట్ – నో పెట్రోల్’ నిబంధన కఠినంగా అమలు జరుగుతుండడంతో బైకర్స్ హెల్మెట్ కొనడం తప్పడం లేదు. బంకు వారికి పోలీసులు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో బైక్‌లో పెట్రోల్ పోయించుకోవాలంటే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా హెల్మెట్లకు గిరాకీ పెరిగింది.