టీ20 ప్రపంచకప్ 2026కు BCCI ప్రకటించిన జట్టుపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. భారత జట్టు కూర్పు బాగుందని హర్భజన్ ప్రశంసించాడు. అయితే, శుభ్‌మన్ గిల్ జట్టులో లేకపోవడం కాస్త బాధ కలిగించిందని తెలిపాడు. కానీ జట్టులో ఉన్నవాళ్లంతా మ్యాచ్ విన్నర్లే అని.. భారత్ వరుసగా ప్రపంచకప్‌లు గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.