TG: వేసవిలో ఎక్కడా నీటి కొరత రాకుండా రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అని అన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీతక్క.. మేడారం జాతరలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.