KRNL: సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంత కుమారి హెచ్చరించారు. శుక్రవారం ఆమె బస్సు ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి బస్సులో హెల్ప్ లైన్ నెంబర్ 9281607001 ప్రదర్శించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ రెండో డ్రైవర్ను ఉంచుకోవాలని ఆమె ఆదేశించారు.