ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రవేట్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకొని ఉన్నత స్థాయిలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. చిన్నారులు పలు వేషధారణతో అందర్నీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు అందమైన ముగ్గులతో పలువురిని అలరించారు.