GDWL: ప్రభుత్వ సేవకి అంకితం చేసిన రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి అని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గద్వాల హౌసింగ్ బోర్డులోని అసోసియేషన్ కార్యాలయంలో నూతన అధ్యక్షులు ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం. లక్ష్మిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆర్. చక్రధర్ ఎన్నికయ్యారు.