ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ సినిమా ఈనెల 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనవరి 8న రాత్రి స్పెషల్ ప్రీమియర్లను ఏర్పాటు చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అనుమతుల కోసం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసింది. స్పెషల్ ప్రీమియర్ టికెట్ ధరను సింగిల్ స్క్రీన్‌లో రూ.800, మల్టీప్లెక్స్‌లో రూ.1000 పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది.