NLG: నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ కావడంతో పట్టణం మరింత అభివృద్ధి కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు పెరుగుతాయి. రుణ సదుపాయం లభిస్తుంది. ఐఏఎస్ స్థాయి అధికారి కార్పొరేషన్‌కు కమిషనర్‌గా నియామకం జరుగుతుంది. మేయర్, కార్పొరేటర్లు ఎన్నికవుతారు. ప్రణాళిక బద్ధమైన పట్టణ అభివృద్ధి, రవాణా సౌకర్యం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.